EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నెక్కొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన

    Author THADEM PRASHANTH | 17 Oct 2026, 10:37 PM | TELANGANA
    నెక్కొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన

    లో-వోల్టేజ్‌ సమస్య పరిష్కారానికి మూడు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు

    బతుకమ్మ ఆటస్థలంలో రూ.40 లక్షలతో సీసీ పనులు.. మహిళా భవన నిర్మాణానికి శ్రీకారం
    నెక్కొండ, అక్టోబర్‌ 17, హిందుస్థాన్‌ మీడియా: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

    మూడు గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం
    వెంకటాపురం గ్రామంలో లో-వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించేందుకు 33/11 కేవీ, 5 ఎంవీఏ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పెద్దకార్పోల్‌ గ్రామంలో మరో 33/11 కేవీ, 5 ఎంవీఏ సబ్‌స్టేషన్‌తో పాటు రూ.10 లక్షల వ్యయంతో మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
    దీక్షకుంట్ల గ్రామంలో 33/11 కేవీ, 5 ఎంవీఏ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి, గౌడ కులస్తుల కోసం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.

    బతుకమ్మ ఆటస్థలంలో రూ.40 లక్షలతో సీసీ పనులు
    నెక్కొండ మండల కేంద్రంలోని బతుకమ్మ ఆటస్థలంలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పనులతో స్థానికులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కార్యక్రమంలో పేర్కొన్నారు.

    విద్యుత్‌, నీటిని పొదుపుగా వినియోగించాలి
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పరిసర గ్రామాల్లో లో-వోల్టేజ్‌ సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
    ఎల్‌-నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే మూడేళ్లలో రైతులు విద్యుత్‌, నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ రావుల హరీష్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లావుడ్య తిరుమల్‌, రెడ్లవాడ సొసైటీ చైర్మన్‌ ఆవుల శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బక్కీ అశోక్‌, కార్యదర్శి చెన్నకేశవులు, మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొనిజేటి బిక్షపతి, సీనియర్‌ నాయకుడు సుధాకర్‌ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా రమేష్‌, వెంకటాపురం సర్పంచ్‌ కవిత అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.అలాగే ఆయా గ్రామాల సర్పంచులు, రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులు, నర్సంపేట విద్యుత్‌ శాఖ డీఈ తిరుపతి, నిర్మాణ విభాగం డీఈ హర్జీ, ఏడీఈ శ్రీధర్‌, ఏఈ చిరంజీవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    నెక్కొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన - Additional Image