నెక్కొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన

లో-వోల్టేజ్‌ సమస్య పరిష్కారానికి మూడు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు బతుకమ్మ ఆటస్థలంలో రూ.40 లక్షలతో సీసీ పనులు.. మహిళా భవన నిర్మాణానికి శ్రీకారం నెక్కొండ, అక్టోబర్‌ 17, హిందుస్థాన్‌ మీడియా: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మూడు గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం వెంకటాపురం గ్రామంలో లో-వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించేందుకు 33/11 కేవీ, 5 ఎంవీఏ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు....