EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల బండ్ల బోనాలలో ఉద్రిక్తత: యువకులపై కేసు నమోదు

    Author P శివశంకర్ | 04 Sep 2026, 10:50 PM | TELANGANA
    చేర్యాల బండ్ల బోనాలలో ఉద్రిక్తత: యువకులపై కేసు నమోదు

    పోలీసులకు, యువకుల మధ్య ఘర్షణ.. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు

    ఐదుగురిపై కేసు నమోదు: చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి
    చేర్యాల, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బండ్ల బోనాల కార్యక్రమంలో పోలీసులకు, కొందరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోనాల కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
    ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి తెలిపారు.అయితే, ఎడ్ల బండిపై ఉన్న తమపై పోలీసులు కొట్టారని కొందరు యువకులు ఆరోపించారు. అత్యంత వైభవంగా జరుగుతున్న బండ్ల బోనాల కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జన సందోహాన్ని నియంత్రించే క్రమంలో కొందరు యువకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఈ క్రమంలోనే యువకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సంప్రదాయంగా నిర్వహించే పండుగలను యువత, ప్రజలు సంయమనం పాటిస్తూ, పరస్పర సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

    చేర్యాల బండ్ల బోనాలలో ఉద్రిక్తత: యువకులపై కేసు నమోదు  - Additional Image