EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కులం పేరుతో దుషించిన ఘటనపై ఏసీపీ సదానందం విచారణ

    Author THADEM PRASHANTH | 03 Aug 2026, 09:00 PM | Crime, TELANGANA
    కులం పేరుతో దుషించిన ఘటనపై ఏసీపీ సదానందం విచారణ

    నర్సాయిపల్లి గ్రామంలో సంఘటన స్థలాన్ని పరిశీలించిన హుస్నాబాద్ ఏసీపీ సదానందం
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై నమోదైన కేసును హుస్నాబాద్ ఏసీపీ సదానందం సోమవారం పరిశీలించారు.
    మద్దూరు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం, నర్సాయిపల్లి గ్రామానికి చెందిన ముస్త్యాల శ్రీనివాస్ తనను గ్రామ వాట్సాప్ గ్రూపులో కులం పేరుతో దూషిస్తూ, అవమానకరమైన, బెదిరింపు ఆడియో సందేశాలను పోస్టు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మద్దూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
    ఈ కేసులో చింతల సదానందం, అలాగే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పోతుగంటి రవీందర్ గౌడ్పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం సంఘటన స్థలాన్ని సందర్శించి సంబంధిత వివరాలను సేకరించారు. ఫిర్యాదుదారుడు, స్థానికులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన అంశాలపై విచారణ నిర్వహించారు.
    ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, విచారణ అనంతరం చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో మద్దూరు పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.