EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవో 1181 రద్దు చేయాలని మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన

    Author THADEM PRASHANTH | 16 Oct 2026, 12:17 AM | TELANGANA
    జీవో 1181 రద్దు చేయాలని మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన

    వేతనాల కోతలు ఆపాలి

    సీడీఎంఏ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ ఉద్యోగుల ఆందోళన

    అన్ని కేటగిరీల సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్‌
    హైదరాబాద్‌, అక్టోబర్‌ 16, హిందుస్థాన్‌ మీడియా: జీవో 1181ను రద్దు చేయాలని, అన్ని కేటగిరీల మున్సిపల్‌ సిబ్బంది వేతనాలను తగ్గించవద్దని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర కేటగిరీల సిబ్బంది హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
    ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్‌ నాయకపు గంగాధర్‌తో పాటు వివిధ మున్సిపాలిటీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. జీవో 1181ను రద్దు చేసి, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
    అనంతరం మున్సిపల్‌ జాయింట్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు.