జీవో 1181 రద్దు చేయాలని మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన
వేతనాల కోతలు ఆపాలి సీడీఎంఏ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన అన్ని కేటగిరీల సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్ హైదరాబాద్, అక్టోబర్ 16, హిందుస్థాన్ మీడియా: జీవో 1181ను రద్దు చేయాలని, అన్ని కేటగిరీల మున్సిపల్ సిబ్బంది వేతనాలను తగ్గించవద్దని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర కేటగిరీల సిబ్బంది హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్ నాయకపు గంగాధర్తో పాటు వివిధ మున్సిపాలిటీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. జీవో 1181ను రద్దు చేసి, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ జాయింట్ డైరెక్టర్కు వినతిపత్రం అందజేశారు....