EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఉద్యమకారులు

    Author P శివశంకర్ | 16 Oct 2026, 12:05 AM | TELANGANA
    సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఉద్యమకారులు

    ఉద్యమకారుల హామీల అమలుకు వెబ్‌సైట్‌ ఏర్పాటుపై హర్షం
    చేర్యాల, అక్టోబర్‌ 15, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంపై చేర్యాల తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
    జీవో నంబర్‌ 679 జీఏ (క్యాబినెట్‌), సీఎం ప్రజావాణి పోర్టల్‌, ఉద్యమకారుల వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలనే ప్రభుత్వ ఆదేశాలపై ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు, కేకే కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షుడు అంబటి అంజయ్య, ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ జహీరుద్దీన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ వెలుగల దుర్గయ్య, ఏఎంసీ డైరెక్టర్‌ పచ్చిమడ్ల వెంకటయ్య గౌడ్‌, కాంగ్రెస్‌ పట్టణ కార్యదర్శి తుమ్మలపల్లి సంతోష్‌, ఫోరం సహాయ కార్యదర్శి బండోజు భాస్కరచారి, 1969 ఉద్యమకారుడు అంబటి నరసయ్య, కందుకూరు సిద్ధిలింగం గుప్తా, అశోక్‌, ఉపేందర్‌ రావ్‌, పంతం రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.