సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఉద్యమకారులు
ఉద్యమకారుల హామీల అమలుకు వెబ్సైట్ ఏర్పాటుపై హర్షం చేర్యాల, అక్టోబర్ 15, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు వెబ్సైట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంపై చేర్యాల తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జీవో నంబర్ 679 జీఏ (క్యాబినెట్), సీఎం ప్రజావాణి పోర్టల్, ఉద్యమకారుల వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలనే ప్రభుత్వ ఆదేశాలపై ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు, కేకే...