EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫార్వర్డ్ బ్లాక్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ గా యాదయ్య చారి నియామకం!

    Author THADEM PRASHANTH | 15 Oct 2026, 04:06 PM | TELANGANA
    ఫార్వర్డ్ బ్లాక్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ గా యాదయ్య చారి నియామకం!

    నియామక పత్రం అందజేసిన ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అందే బీరన్న
    ​

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తా: యాదయ్య చారి
    ​

    ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని నూతన కార్యవర్గం స్పష్టీకరణ
    ​ మేడ్చల్ (హిందుస్థాన్ మీడియా):
    ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మేడ్చల్ జిల్లా కన్వీనర్‌గా యాదయ్య చారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అందే బీరన్న ఆయనకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అందే బీరన్న మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
    ​తన నియామకం పట్ల నూతన కన్వీనర్ యాదయ్య చారి హర్షం వ్యక్తం చేస్తూ.. దేశ స్వాతంత్ర్య సమరంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నిర్మించి, వేలాది మంది యువతీ యువకులను సమాయత్తం చేసి బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిదురించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీలో బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందన్నారు. బోస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పీడిత వర్గాల హక్కుల కోసం, మేడ్చల్ జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పోరాటాలు సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాకాల లక్ష్మారెడ్డి, రాజు, రమేష్, రాములు, శేఖర్, ఎల్లయ్య తదితరులు పాల్గొని నూతన కన్వీనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰