ఫార్వర్డ్ బ్లాక్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ గా యాదయ్య చారి నియామకం!
నియామక పత్రం అందజేసిన ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అందే బీరన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తా: యాదయ్య చారి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని నూతన కార్యవర్గం స్పష్టీకరణ మేడ్చల్ (హిందుస్థాన్ మీడియా): ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మేడ్చల్ జిల్లా కన్వీనర్గా యాదయ్య చారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అందే బీరన్న ఆయనకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అందే బీరన్న మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తన నియామకం పట్ల...