EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గా మాత

    Author B SRAVAN KUMAR | 11 Oct 2026, 07:14 PM | TELANGANA
    బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గా మాత

    మర్పడగ విజయదుర్గ ఆలయంలో వైభవంగా నవరాత్రి పూజలు
    సిద్దిపేట జిల్లా, కొండపాక, అక్టోబర్‌ 10, హిందుస్థాన్‌ మీడియా: కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
    క్షేత్ర నిర్వాహకులు, విజయదుర్గ ఉపాసకులు డాక్టర్‌ చెప్పాల హరినాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే స్వామివారికి, అమ్మవారికి వివిధ ఫలరసాలతో, పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు కంకణధారణ, మాల అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు అల్పాహారంతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.