బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గా మాత

మర్పడగ విజయదుర్గ ఆలయంలో వైభవంగా నవరాత్రి పూజలు సిద్దిపేట జిల్లా, కొండపాక, అక్టోబర్‌ 10, హిందుస్థాన్‌ మీడియా: కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర నిర్వాహకులు, విజయదుర్గ ఉపాసకులు డాక్టర్‌ చెప్పాల హరినాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే స్వామివారికి, అమ్మవారికి వివిధ ఫలరసాలతో, పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు కంకణధారణ, మాల అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు అల్పాహారంతో పాటు...