EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూర్ మోడల్ స్కూల్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

    Author R K SRINIVAS | 09 Oct 2026, 07:33 PM | TELANGANA
    మద్దూర్ మోడల్ స్కూల్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిన విద్యార్థినులు
    మద్దూరు, అక్టోబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను మద్దూరులోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
    విద్యార్థినులు తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహనతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, ఐకమత్య భావనను పెంపొందించారు.ఈ కార్యక్రమానికి మద్దూరు మండల విద్యాధికారి వరదరాజు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ సర్వర్‌ హాజరై విద్యార్థినులను అభినందించారు. చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని సూచించారు.

    మద్దూర్ మోడల్ స్కూల్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు - Additional Image