మద్దూర్ మోడల్ స్కూల్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిన విద్యార్థినులు మద్దూరు, అక్టోబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను మద్దూరులోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహనతో...