EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజెంటేషన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

    Author P శివశంకర్ | 09 Oct 2026, 07:14 PM | TELANGANA
    ప్రజెంటేషన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

    రంగురంగుల పూల బతుకమ్మలు.. సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థుల సందడి

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి: ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ జ్యోతి
    చేర్యాల, హిందుస్థాన్‌ మీడియా: చేర్యాల ప్రెజెంటేషన్‌ హైస్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
    పాఠశాల ప్రిన్సిపాల్‌ రెవ. సిస్టర్‌ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి పండుగ శోభను తీసుకొచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ చేసిన ఉపన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
    ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ జ్యోతి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలతో విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతిపై గౌరవం, సంప్రదాయాల పట్ల అవగాహన, ఐకమత్య భావన పెంపొందుతాయని తెలిపారు.

    ప్రజెంటేషన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు  - Additional Image