ప్రజెంటేషన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

రంగురంగుల పూల బతుకమ్మలు.. సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థుల సందడి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి: ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ జ్యోతి చేర్యాల, హిందుస్థాన్‌ మీడియా: చేర్యాల ప్రెజెంటేషన్‌ హైస్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ రెవ. సిస్టర్‌ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి పండుగ శోభను తీసుకొచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ చేసిన ఉపన్యాసాలు ప్రత్యేక...