EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కల్లుగీత కార్మికుల పింఛన్ల గడవు దరఖాస్తు పెంచాలి: ఎంపీడీవో కు వినతి

    Author B SRAVAN KUMAR | 05 Oct 2026, 07:57 PM | TELANGANA
    కల్లుగీత కార్మికుల పింఛన్ల గడవు దరఖాస్తు పెంచాలి: ఎంపీడీవో కు వినతి

    అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి
    కొండపాక, అక్టోబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: కల్లుగీత కార్మికుల పింఛన్ల దరఖాస్తు గడువును పెంచి, అర్హులైన ప్రతి గీత కార్మికుడికి పింఛన్‌ మంజూరు చేయాలని గౌడ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతల సాయిబాబా గౌడ్‌, గౌడ సంఘాల సమితి రాష్ట్ర కో-కన్వీనర్‌ అంబటి బాలచందర్‌ గౌడ్‌ ఎంపీడీవోను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరింత పొడిగించాలని కోరారు. అర్హత ఉన్న గీత కార్మికులకు ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ఒక్క అర్హుడైన గీత కార్మికుడు కూడా పింఛన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. దరఖాస్తు గడువు పెంపుతో పాటు, అర్హత కలిగిన కార్మికులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఎంపీడీవోను కోరారు.ఈ కార్యక్రమంలో రాజా గౌడ్‌, కొడకండ్ల కనకరాజు గౌడ్‌, సాధుపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.