కల్లుగీత కార్మికుల పింఛన్ల గడవు దరఖాస్తు పెంచాలి: ఎంపీడీవో కు వినతి
అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి కొండపాక, అక్టోబర్ 5, హిందుస్థాన్ మీడియా: కల్లుగీత కార్మికుల పింఛన్ల దరఖాస్తు గడువును పెంచి, అర్హులైన ప్రతి గీత కార్మికుడికి పింఛన్ మంజూరు చేయాలని గౌడ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతల సాయిబాబా గౌడ్, గౌడ సంఘాల సమితి రాష్ట్ర కో-కన్వీనర్ అంబటి బాలచందర్ గౌడ్ ఎంపీడీవోను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరింత పొడిగించాలని కోరారు. అర్హత ఉన్న గీత కార్మికులకు ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని...