EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మండల రజక సంఘం నూతన అధ్యక్షుడిగా సందిల రమేష్

    Author B SRAVAN KUMAR | 05 Oct 2026, 05:48 PM | TELANGANA
    మండల రజక సంఘం నూతన అధ్యక్షుడిగా సందిల రమేష్

    కుకునూరుపల్లిలో నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

    రజకుల ఐక్యతే లక్ష్యం.. సంక్షేమ పథకాల సాధన కోసం ఉద్యమం: రాష్ట్ర నాయకత్వం
    కొండపాక, అక్టోబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి కుకునూరుపల్లి మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో కుకునూరుపల్లిలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ గణేష్‌ చిన్నరంగారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సందిల రమేష్‌, ఉపాధ్యక్షులుగా రుద్రారం ప్రసాద్‌, బస్వారాజుల కిషన్‌, ప్రధాన కార్యదర్శిగా రాచకొండ బిక్షపతి, మండల యువజన అధ్యక్షుడిగా ఎలగారి భూపాల్‌ ఎన్నికయ్యారు.
    ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ గణేష్‌ మాట్లాడుతూ.. రజకుల ఐక్యతను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారుల సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధనతో పాటు రజక వృత్తిదారుల పెన్షన్ల కోసం నిరంతరం కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు.
    నవంబర్‌లో సిద్దిపేట జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి 4వ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీ రజకుల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.