మండల రజక సంఘం నూతన అధ్యక్షుడిగా సందిల రమేష్

కుకునూరుపల్లిలో నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రజకుల ఐక్యతే లక్ష్యం.. సంక్షేమ పథకాల సాధన కోసం ఉద్యమం: రాష్ట్ర నాయకత్వం కొండపాక, అక్టోబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి కుకునూరుపల్లి మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో కుకునూరుపల్లిలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ గణేష్‌ చిన్నరంగారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సందిల రమేష్‌, ఉపాధ్యక్షులుగా రుద్రారం ప్రసాద్‌, బస్వారాజుల కిషన్‌, ప్రధాన కార్యదర్శిగా...