EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • న్యాయవాది శ్రీధర్‌పై దాడిని ఖండించిన చేర్యాల బార్ అసోసియేషన్

    Author P శివశంకర్ | 05 Oct 2026, 02:32 PM | TELANGANA
    న్యాయవాది  శ్రీధర్‌పై దాడిని ఖండించిన చేర్యాల బార్ అసోసియేషన్

    న్యాయవాదులపై దాడులు అరికట్టాలి

    కోర్టు విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన
    చేర్యాల, హిందుస్థాన్‌ మీడియా: న్యాయవాదులపై దాడులను అరికట్టి, న్యాయవాదులకు భద్రత కల్పించాలని చేర్యాల బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. చేర్యాల కోర్టు పరిధిలోని నాగపురి గ్రామంలో న్యాయవాది గూడెపు శ్రీధర్‌ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
    ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ.. నాగపురిలో న్యాయవాది గూడెపు శ్రీధర్‌ ఇంటిపై దుండగులు దాడి చేసి, కారు అద్దాలను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలిగించారని తెలిపారు. అంతేకాకుండా ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తూ, ఈ ఘటనకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    న్యాయవాదుల విధులు సక్రమంగా నిర్వహించేందుకు వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, న్యాయవాదులపై దాడులను బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.ఈ నిరసన కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్‌, సీనియర్‌ న్యాయవాది భూమిగారి మనోహర్‌, న్యాయవాదులు పొన్నం సురేష్‌, నల్గొండ సంతోష్‌, తాటికొండ ప్రణీత్‌, గుస్క వెంకటేష్‌, పర్వతం రాములు, మోకు రాజిరెడ్డి, నీరటి రాజలింగం, దర్శనం ప్రశాంత్‌, అంకణి సురేందర్‌, బైరగోని ప్రసాద్‌, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    న్యాయవాది  శ్రీధర్‌పై దాడిని ఖండించిన చేర్యాల బార్ అసోసియేషన్  - Additional Image