న్యాయవాది శ్రీధర్పై దాడిని ఖండించిన చేర్యాల బార్ అసోసియేషన్
న్యాయవాదులపై దాడులు అరికట్టాలి కోర్టు విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన చేర్యాల, హిందుస్థాన్ మీడియా: న్యాయవాదులపై దాడులను అరికట్టి, న్యాయవాదులకు భద్రత కల్పించాలని చేర్యాల బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చేర్యాల కోర్టు పరిధిలోని నాగపురి గ్రామంలో న్యాయవాది గూడెపు శ్రీధర్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ.. నాగపురిలో న్యాయవాది గూడెపు శ్రీధర్ ఇంటిపై దుండగులు దాడి చేసి, కారు అద్దాలను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలిగించారని తెలిపారు. అంతేకాకుండా ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తూ, ఈ...