EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలి:ఎంపీడీవో మహబూబ్‌ అలీ

    Author B SRAVAN KUMAR | 03 Oct 2026, 07:50 PM | TELANGANA
    గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలి:ఎంపీడీవో మహబూబ్‌ అలీ

    వార్డు సభ్యుల శిక్షణ తరగతులు పూర్తి

    శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల అందజేత
    సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 3, కుకునూరుపల్లి, హిందుస్థాన్ మీడియా: కుకునూరుపల్లి మండల పరిధిలో వార్డు సభ్యులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయని మండల ఎంపీడీవో మహబూబ్‌ అలీ తెలిపారు.ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో వార్డు సభ్యులకు గ్రామపంచాయతీ పాలన, విధులు–బాధ్యతలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు.
    గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో వార్డు సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని ఎంపీడీవో మహబూబ్‌ అలీ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
    ఐదు రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు కార్యక్రమం ముగింపు సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. సర్టిఫికెట్లు అందుకోవడంతో శిక్షణలో పాల్గొన్న వార్డు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.