గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలి:ఎంపీడీవో మహబూబ్‌ అలీ

వార్డు సభ్యుల శిక్షణ తరగతులు పూర్తి శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల అందజేత సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 3, కుకునూరుపల్లి, హిందుస్థాన్ మీడియా: కుకునూరుపల్లి మండల పరిధిలో వార్డు సభ్యులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయని మండల ఎంపీడీవో మహబూబ్‌ అలీ తెలిపారు.ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో వార్డు సభ్యులకు గ్రామపంచాయతీ పాలన, విధులు–బాధ్యతలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో...