EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఘన సన్మానం

    Author B SRAVAN KUMAR | 03 Oct 2026, 07:43 PM | TELANGANA
    వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఘన సన్మానం

    సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అభినందనీయం

    ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా
    సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 3, కుకునూరుపల్లి, హిందుస్థాన్ మీడియా: కుకునూరుపల్లి మండల కేంద్రంలో వాసవి క్లబ్‌ కపుల్స్‌ ఆధ్వర్యంలో శనివారం పాత్రికేయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కాసం నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కాసం నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టిని ఆకర్షించడంలో మీడియా పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
    ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తూ సమాజ సేవలో భాగస్వాములవుతున్న పాత్రికేయులను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
    కార్యక్రమంలో వాసవి క్లబ్‌ కపుల్స్‌ కుకునూరుపల్లి అధ్యక్షుడు పాండురంగం, కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య మహాసభ కుకునూరుపల్లి అధ్యక్షుడు గంగిశెట్టి పాండురంగం, నంగునూరు నాగరాజు, గంగిశెట్టి బాలయ్య, శ్రీనివాస్‌, నాగమల్లి సత్యం, గంగిశెట్టి రాజ్‌కుమార్‌, కుడితల సంతోష్‌, కొడతాల చంద్రశేఖర్‌, కొమురవెల్లి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.