వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఘన సన్మానం

సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అభినందనీయం ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 3, కుకునూరుపల్లి, హిందుస్థాన్ మీడియా: కుకునూరుపల్లి మండల కేంద్రంలో వాసవి క్లబ్‌ కపుల్స్‌ ఆధ్వర్యంలో శనివారం పాత్రికేయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కాసం నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కాసం నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టిని ఆకర్షించడంలో మీడియా పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా...