EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 20 ఏళ్ల లో వోల్టేజ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం!

    Author THADEM PRASHANTH | 03 Oct 2026, 07:35 PM | TELANGANA
    20 ఏళ్ల లో వోల్టేజ్‌ సమస్యకు శాశ్వత  పరిష్కారం!

    వెల్జీపురం సబ్‌స్టేషన్‌కు రూ.3.76 కోట్లు మంజూరు

    మంజూరు పత్రాన్ని సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌కు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
    రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్‌ 3, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండలం వెల్జీపురం, ఓబులాపురం, చిక్కుడువానిపల్లె, రామోజీపేట గ్రామాల రైతులు గత రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న లో-వోల్టేజ్‌ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఆయా గ్రామాల విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు రూ.3.76 కోట్ల అంచనా వ్యయంతో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరైంది.
    మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవతో సబ్‌స్టేషన్‌ మంజూరైనట్లు తెలిపారు. ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ, డీఈ అంజయ్య, ఏఈలు గుడెల్లి శ్రీనివాస్‌, నగేష్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ వంగపల్లి రఘుపతిరెడ్డి, విద్యుత్‌ శాఖ సిబ్బంది కనకయ్య, నరేష్‌ తదితరుల సహకారంతో మంజూరు ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొన్నారు.
    సర్పంచ్‌కు మంజూరు పత్రం
    హైదరాబాద్‌ సచివాలయంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్జీపురం సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌కు సబ్‌స్టేషన్‌ మంజూరు పత్రాన్ని అందజేశారు.
    సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తే వెల్జీపురం, ఓబులాపురం, చిక్కుడువానిపల్లె, రామోజీపేట గ్రామాల రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న లో-వోల్టేజ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
    గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు రైతుల విద్యుత్‌ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
    సబ్‌స్టేషన్‌ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులకు, విద్యుత్‌ శాఖ సిబ్బందికి సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    సబ్‌స్టేషన్‌ మంజూరు కావడంపై పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గుండ వెంకటేశం, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ కంకణాల రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.