20 ఏళ్ల లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం!
వెల్జీపురం సబ్స్టేషన్కు రూ.3.76 కోట్లు మంజూరు మంజూరు పత్రాన్ని సర్పంచ్ నాయిని నవీన్కుమార్కు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 3, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండలం వెల్జీపురం, ఓబులాపురం, చిక్కుడువానిపల్లె, రామోజీపేట గ్రామాల రైతులు గత రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఆయా గ్రామాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు రూ.3.76 కోట్ల అంచనా వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైంది. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవతో సబ్స్టేషన్ మంజూరైనట్లు తెలిపారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ, డీఈ అంజయ్య, ఏఈలు గుడెల్లి శ్రీనివాస్, నగేష్, లైన్ ఇన్స్పెక్టర్ వంగపల్లి రఘుపతిరెడ్డి, విద్యుత్ శాఖ...