EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నంగునూరు లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

    Author THADEM PRASHANTH | 02 Oct 2026, 08:17 PM | TELANGANA
    నంగునూరు లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

    గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు

    ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎల్లా శ్రీనివాస్‌రెడ్డి
    సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 2, నంగునూరు, హిందుస్థాన్ మీడియా: నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లా శ్రీనివాస్‌రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    ఈ సందర్భంగా ఎల్లా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సత్యం, అహింస మార్గాల్లో పయనిస్తూ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
    అనంతరం నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్‌ నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు సిద్ధిరాములు, సురేందర్‌రెడ్డి, డీసీసీ సభ్యుడు కాటం కనకయ్య, కాంగ్రెస్‌ నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.