నంగునూరు లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎల్లా శ్రీనివాస్‌రెడ్డి సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2, నంగునూరు, హిందుస్థాన్ మీడియా: నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లా శ్రీనివాస్‌రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సత్యం, అహింస మార్గాల్లో పయనిస్తూ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి ఎల్లప్పుడూ...