EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గాంధీజీకి ఘన నివాళులు..బంజేరుపల్లిలో ప్రత్యేక గ్రామ సభ

    Author THADEM PRASHANTH | 02 Oct 2026, 07:54 PM | TELANGANA
    గాంధీజీకి ఘన నివాళులు..బంజేరుపల్లిలో ప్రత్యేక గ్రామ సభ

    వీబీజీ రామ్‌జీ కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహన

    సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం
    సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 2, బంజేరుపల్లి, హిందుస్థాన్ మీడియా: గాంధీ జయంతిని పురస్కరించుకుని బంజేరుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించి, వీబీజీ రామ్‌జీ (VB-G RAM G) ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్య రమేష్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
    ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర, దేశం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజలకు అందించిన స్ఫూర్తిని కొనియాడారు.
    అనంతరం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో వీబీజీ రామ్‌జీ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి, ఉపాధి, నీటి సంరక్షణకు సంబంధించిన పనులపై చర్చించినట్లు తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సర్పంచ్‌ సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బీర్రు రాధిక, ఉపసర్పంచ్‌ ఎర్ర సుజాత రాజు, వార్డు సభ్యులు మౌనిక, రాజు, రామచంద్రు, స్వామి, ఉప్ప స్వామి, జనగాం వెంకటేశ్వర్లు, భాస్కర్‌, బోడ రాజేష్‌, ఫిలాసడ్‌ సురేష్‌బాబు, మహిళా సంఘాల సభ్యులు, వీఓలు, సీఐలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.