గాంధీజీకి ఘన నివాళులు..బంజేరుపల్లిలో ప్రత్యేక గ్రామ సభ
వీబీజీ రామ్జీ కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహన సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2, బంజేరుపల్లి, హిందుస్థాన్ మీడియా: గాంధీ జయంతిని పురస్కరించుకుని బంజేరుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించి, వీబీజీ రామ్జీ (VB-G RAM G) ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్య రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర, దేశం...