EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పెద్ద అంబర్‌పేట్‌లో ఉచిత వైద్య, రక్త పరీక్షలు

    Author V RAMESH | 02 Oct 2026, 02:22 PM | TELANGANA
    పెద్ద అంబర్‌పేట్‌లో ఉచిత వైద్య, రక్త పరీక్షలు

    ఐదు కాలనీల ప్రజలకు వైద్య సేవలు.. పలు రకాల ఆరోగ్య పరీక్షలు
    పెద్ద అంబర్‌పేట్‌, అక్టోబర్‌ 2, హిందుస్థాన్ మీడియా: పెద్ద అంబర్‌పేట్‌ 252 డివిజన్‌ లక్ష్మారెడ్డిపాలెంలోని యూటీఎఫ్‌ డీ హిల్స్‌ కాలనీలో లయన్స్‌ క్లబ్‌ వనస్థలిపురం సహకారంతో యూటీఎఫ్‌ డీ హిల్స్‌ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య, రక్త పరీక్షలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
    ఈ శిబిరానికి యూటీఎఫ్‌ డీ హిల్స్‌ కాలనీతో పాటు సమీపంలోని ఐదు కాలనీలకు చెందిన ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉద్దీప్య వెల్‌ బేబీ సెంటర్‌, ఎస్‌వీ డయాగ్నస్టిక్‌ చింతలకుంట ఆధ్వర్యంలో పీడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌, పల్మనాలజీ సేవలను అందించారు. అలాగే ఆర్థోపెడిక్‌, గైనకాలజీ, గుండె, కంటి సంబంధిత పరీక్షలను నిర్వహించారు.
    ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల కాలనీ ప్రజలు కాలనీ కమిటీ సభ్యులకు, లయన్స్‌ క్లబ్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    ఈ కార్యక్రమానికి లయన్స్‌ క్లబ్‌ 320 హెచ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ అశోక్‌కుమార్‌ స్వాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యంగా, అర్హత కలిగిన వ్యక్తులు వైద్యుల సూచనల మేరకు రక్తదానం చేయాలని సూచించారు.
    రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
    కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాంప్రసాద్‌, చంద్రమౌళి, నరసింహారెడ్డి తదితరులు, కాలనీ కమిటీ ప్రతినిధులు మోహన్‌రెడ్డి, అశోక్‌, రామ్‌రెడ్డి, రమేష్‌గౌడ్‌, ఆనంద్‌రెడ్డి, శంకర్‌గౌడ్‌, శ్రీరాములు, నరేందర్‌, చలపతితో పాటు వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.