పెద్ద అంబర్‌పేట్‌లో ఉచిత వైద్య, రక్త పరీక్షలు
ఐదు కాలనీల ప్రజలకు వైద్య సేవలు.. పలు రకాల ఆరోగ్య పరీక్షలు పెద్ద అంబర్‌పేట్, అక్టోబర్ 2, హిందుస్థాన్ మీడియా: పెద్ద అంబర్‌పేట్ 252 డివిజన్ లక్ష్మారెడ్డిపాలెంలోని యూటీఎఫ్ డీ హిల్స్ కాలనీలో లయన్స్ క్లబ్ వనస్థలిపురం సహకారంతో యూటీఎఫ్ డీ హిల్స్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య, రక్త పరీక్షలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి యూటీఎఫ్ డీ హిల్స్ కాలనీతో పాటు సమీపంలోని ఐదు కాలనీలకు చెందిన ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉద్దీప్య వెల్ బేబీ సెంటర్, ఎస్‌వీ డయాగ్నస్టిక్ చింతలకుంట ఆధ్వర్యంలో పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ సేవలను అందించారు. అలాగే ఆర్థోపెడిక్, గైనకాలజీ, గుండె,...