EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుంట్లూర్‌ చౌరస్తాలో ట్రాఫిక్ తిప్పలు..చర్యలు చేపట్టాలని వినతి..!

    Author V RAMESH | 02 Oct 2026, 09:16 AM | TELANGANA
    కుంట్లూర్‌ చౌరస్తాలో ట్రాఫిక్ తిప్పలు..చర్యలు చేపట్టాలని వినతి..!

    సాయంత్రం వేళ రెండు కిలోమీటర్ల మేర వాహనాల బారులు

    ట్రాఫిక్‌ నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలి: వాహనదారులు
    పెద్ద అంబర్‌పేట్‌ డివిజన్‌, అక్టోబర్‌ 1, హిందుస్థాన్ మీడియా: కుంట్లూర్‌ చౌరస్తాలో ప్రతిరోజూ సాయంత్రం వేళ తీవ్ర ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోందని వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగోల్‌, పెద్ద అంబర్‌పేట్‌, గౌరెల్లి, హయత్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో చౌరస్తాకు చేరుకోవడంతో ట్రాఫిక్‌ రద్దీ తీవ్రమవుతోంది.
    చౌరస్తాకు నాలుగు వైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాలేజీలు, కార్యాలయాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు, షాపింగ్‌ కోసం వచ్చే వారు, ఇతర ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ట్రాఫిక్‌ నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయిన తర్వాత పోలీసులు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారని, ముందస్తుగా పర్యవేక్షణ ఉంటే సమస్యను కొంతవరకు నివారించవచ్చని వాహనదారులు అంటున్నారు.
    ప్రధాన రహదారులు కలిసే కుంట్లూర్‌ చౌరస్తాలో సాయంత్రం వేళ ప్రత్యేకంగా ట్రాఫిక్‌ పోలీసులను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళిక రూపొందించి, రద్దీ సమయాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
    ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

    కుంట్లూర్‌ చౌరస్తాలో ట్రాఫిక్ తిప్పలు..చర్యలు చేపట్టాలని వినతి..! - Additional Image