కుంట్లూర్‌ చౌరస్తాలో ట్రాఫిక్ తిప్పలు..చర్యలు చేపట్టాలని వినతి..!

సాయంత్రం వేళ రెండు కిలోమీటర్ల మేర వాహనాల బారులు ట్రాఫిక్‌ నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలి: వాహనదారులు పెద్ద అంబర్‌పేట్‌ డివిజన్‌, అక్టోబర్‌ 1, హిందుస్థాన్ మీడియా: కుంట్లూర్‌ చౌరస్తాలో ప్రతిరోజూ సాయంత్రం వేళ తీవ్ర ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోందని వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగోల్‌, పెద్ద అంబర్‌పేట్‌, గౌరెల్లి, హయత్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో చౌరస్తాకు చేరుకోవడంతో ట్రాఫిక్‌ రద్దీ తీవ్రమవుతోంది. చౌరస్తాకు నాలుగు వైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాలేజీలు, కార్యాలయాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు, షాపింగ్‌ కోసం వచ్చే వారు, ఇతర ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర...