EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

    Author R K SRINIVAS | 01 Oct 2026, 07:26 AM | TELANGANA
    రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

    దిష్టిబొమ్మ దహన యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు.. మద్దూరులో ఉద్రిక్తత

    వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మోకు ఉదయ్‌రెడ్డి డిమాండ్‌
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మద్దూరు మండల బీజేపీ అధ్యక్షుడు మోకు ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
    రేవంత్‌రెడ్డి సెప్టెంబర్‌ 28న ఢిల్లీలో చేసిన ప్రసంగంలో శ్రీరాముడు, శివుడి ఆరాధనను ఉత్తర–దక్షిణ, ఆర్య–ద్రావిడ సందర్భాలతో ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా మోకు ఉదయ్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
    దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
    కార్యక్రమంలో మద్దూరు మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.