రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

దిష్టిబొమ్మ దహన యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు.. మద్దూరులో ఉద్రిక్తత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మోకు ఉదయ్‌రెడ్డి డిమాండ్‌ సిద్దిపేట జిల్లా, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మద్దూరు మండల బీజేపీ అధ్యక్షుడు మోకు ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్‌రెడ్డి సెప్టెంబర్‌ 28న ఢిల్లీలో చేసిన ప్రసంగంలో శ్రీరాముడు, శివుడి ఆరాధనను ఉత్తర–దక్షిణ, ఆర్య–ద్రావిడ సందర్భాలతో ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం...