EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూ అవకతవకలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష

    Author THADEM PRASHANTH | 01 Oct 2026, 07:20 AM | TELANGANA
    భూ అవకతవకలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష

    జీవో నంబర్‌ 134 ప్రకారం భూ వ్యవహారాలపై అధికారులకు సూచనలు
    రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్‌ 30, హిందుస్థాన్ మీడియా: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 134 ప్రకారం భూ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, జనగామ జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
    జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, జిల్లాలోని తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి భూ వ్యవహారాలపై సమీక్షించారు. జీవో నంబర్‌ 134 పరిధిలో పరిశీలించాల్సిన భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలను అధికారులు సమావేశంలో సమర్పించినట్లు సమాచారం.
    ఈ సందర్భంగా భూములకు సంబంధించిన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలను పరిశీలించిన కమిటీ సభ్యుడు సందీప్‌కుమార్‌ ఝా.. సంబంధిత అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు. భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు.
    జీవో 134 కింద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో చైర్‌పర్సన్‌గా శ్రీదేవసేన, కన్వీనర్‌గా రాజీవ్‌గాంధీ హనుమంతు, సభ్యుడిగా జనగామ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఉన్నారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించిన విచారణల్లో కమిటీలో భాగస్వాములు కానున్నారు.