భూ అవకతవకలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష
జీవో నంబర్ 134 ప్రకారం భూ వ్యవహారాలపై అధికారులకు సూచనలు రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 30, హిందుస్థాన్ మీడియా: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 134 ప్రకారం భూ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లాలోని తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి భూ వ్యవహారాలపై సమీక్షించారు. జీవో నంబర్ 134 పరిధిలో పరిశీలించాల్సిన భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలను అధికారులు సమావేశంలో సమర్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా...