EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాలకు అదనపు సివిల్ జడ్జి కోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి

    Author P శివశంకర్ | 28 Sep 2026, 10:37 PM | TELANGANA
    చేర్యాలకు అదనపు సివిల్ జడ్జి కోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి

    చేర్యాల కోర్టులో 2,549 సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌
    జిల్లా ప్రధాన న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్‌కు బార్‌ అసోసియేషన్‌ వినతి
    చేర్యాల, సెప్టెంబర్‌ 28, హిందుస్థాన్ మీడియా: చేర్యాల కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్‌కు వినతిపత్రం అందజేశారు.
    ప్రస్తుతం చేర్యాల కోర్టు పరిధిలో 2,549 సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు ఎంతో అవసరమని వారు వివరించారు.
    ఈ అంశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్‌ సానుకూలంగా స్పందించి, న్యాయవాదులకు తగిన సూచనలు చేసినట్లు బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. అదనపు కోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.