చేర్యాలకు అదనపు సివిల్ జడ్జి కోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి

చేర్యాల కోర్టులో 2,549 సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్‌కు బార్‌ అసోసియేషన్‌ వినతి చేర్యాల, సెప్టెంబర్‌ 28, హిందుస్థాన్ మీడియా: చేర్యాల కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం చేర్యాల కోర్టు పరిధిలో 2,549 సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా...