EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా

    Author THADEM PRASHANTH | 28 Sep 2026, 08:09 PM | TELANGANA
    సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా

    సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా
    వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి
    2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
    సిద్దిపేట, సెప్టెంబర్‌ 28, హిందుస్థాన్ మీడియా: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో నాగరాజమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.
    ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం జీఓ నెం.19 విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ కాకపోవడంతో వికలాంగులు ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
    21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి
    కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జనాభా లెక్కల ప్రక్రియలో వికలాంగుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఎన్‌పీఆర్‌డీ నాయకులు డిమాండ్‌ చేశారు. 2016 నాటి రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌ చట్టం కింద గుర్తించిన వైకల్యాలన్నింటినీ లెక్కల్లో నమోదు చేయాలని కోరారు.
    2027 జనాభా లెక్కల్లో పరిమిత సంఖ్యలో వైకల్యాలనే నమోదు చేసే విధానం ఉంటే అనేక వర్గాలకు చెందిన వికలాంగుల వివరాలు పూర్తిగా నమోదు కాకపోయే అవకాశం ఉందని ఎన్‌పీఆర్‌డీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆటిజం, నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు, మరుగుజ్జుతనం, కుష్ఠువ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులు, చెవిటి-బ్లైండ్‌, బహుళ వైకల్యాలు, రక్త సంబంధిత రుగ్మతలు తదితర కేటగిరీలను కూడా సమగ్రంగా నమోదు చేయాలని కోరింది.
    భవిష్యత్‌లో విద్య, ఉపాధి, ఆరోగ్యం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ పథకాల రూపకల్పనకు సరైన గణాంకాలు అవసరమని ఎన్‌పీఆర్‌డీ నాయకులు పేర్కొన్నారు.
    21 రకాల వైకల్యాల వివరాలు సమగ్రంగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, వికలాంగుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.
    ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా గౌరవ అధ్యక్షులు జి.భాస్కర్‌, జిల్లా అధ్యక్షులు ఎం.డి.సాజిద్‌, జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి అనిల్‌, వి.యాదయ్య, ప్రభాకర్‌, తాండ్ర సత్తయ్య, మల్లేశం, డాక్టర్‌ రాజు, సతీష్‌, సాయిలు, ఆంజనేయులు, లక్ష్మీనర్సయ్య, తమ్మడి రాజు, పర్వతం మల్లయ్య, పెద్దులు, సదానందం, రాజవర్ధన్‌రెడ్డి, భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.