సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా

సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి 2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య సిద్దిపేట, సెప్టెంబర్‌ 28, హిందుస్థాన్ మీడియా: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో నాగరాజమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను...