EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

    Author THADEM PRASHANTH | 26 Sep 2026, 06:24 PM | TELANGANA
    సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

    వర్గీకరణ ఉద్యమంలో మూడు దశాబ్దాలుగా పనిచేసిన నాయకుల చేరిక

    సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి
    సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 26, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ కార్మిక, గనులు, కర్మాగారాల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు కాంగ్రెస్‌గత మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ లక్ష్యంగా ఉద్యమంలో పనిచేశామని నాయకులు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఉపాధి అవకాశాల్లో తమకు న్యాయం జరగాలనే లక్ష్యంతో వర్గీకరణ కోసం పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమంతో పాటు పలు సామాజిక సమస్యలపై, సామాజిక తెలంగాణ లక్ష్యంగా కూడా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
    సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకు చట్టపరమైన అవకాశం ఏర్పడిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మాదిగ పల్లెల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
    కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో సిద్దిపేట జిల్లా సీనియర్‌ నాయకులు పెద్దమాతరి బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకులు బొందని రాజమల్లు, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బాబు రావు రోమాల, రాష్ట్ర కమిటీ నాయకులు ధర్మారం ఎల్లం, కాకి రాజ్యం, కోడూరు బాలరాజ్‌, బూరుగు యాదగిరి, బాకుర్‌ అశోక్‌, గుండుకాడి భూపతి, వేముల శ్రీనివాస్‌, గొప్పని చంద్రం, తుటి జంగీర్‌, మాదాస్‌ బాబు తదితరులు ఉన్నారు.
    హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు సతీష్‌ మాదిగ, అల్లారం రత్నయ్య మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు.