EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

    Author THADEM PRASHANTH | 26 Sep 2026, 04:57 PM | TELANGANA
    ఘనంగా చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

    రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

    ఐలమ్మ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి
    చిన్నకోడూర్, సెప్టెంబర్‌ 26, హిందుస్థాన్ మీడియా: మండల పరిధిలోని రామునిపట్ల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
    కార్యక్రమంలో సర్పంచ్‌ బొల్లం భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
    ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడంతో పాటు, ఆమె ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి విలువలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బొల్లం చంద్రం, ఉప సర్పంచ్‌ బొల్లం కుమార్‌, రజక సంఘం అధ్యక్షులు అంజయ్య, ప్రధాన కార్యదర్శి మల్యాల స్వామి, ప్రజా సంఘాల నాయకులు, బీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు పోతరాజు శంకర్‌, టీఎంఆర్‌పీఎస్‌ నాయకులు మాణిక్యం, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పరశురాములు, కుమ్మరి సంఘం అధ్యక్షులు తిరుపతి, రవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.