ఘనంగా చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం ఐలమ్మ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి చిన్నకోడూర్, సెప్టెంబర్‌ 26, హిందుస్థాన్ మీడియా: మండల పరిధిలోని రామునిపట్ల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొల్లం భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ...