EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధూల్మిట్ట పాఠశాలకు మరో ఘనత

    Author R K SRINIVAS | 25 Sep 2026, 12:33 PM | TELANGANA
    ధూల్మిట్ట పాఠశాలకు మరో ఘనత

    జిల్లాస్థాయి యువ టూరిజం క్లబ్‌ పోటీల్లో మూడో స్థానం

    రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ధూల్మిట్ట జెడ్పీహెచ్‌ఎస్‌
    సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 25, హిందుస్థాన్ మీడియా: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్‌ జిల్లా స్థాయి పోటీల్లో ధూల్మిట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మూడో స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లాలోని 78 పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో ధూల్మిట్ట పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి అనుముల కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ధూల్మిట్ట పాఠశాల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల్లో పర్యాటక ప్రాంతాలు, స్థానిక చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంచేందుకు యువ టూరిజం క్లబ్‌ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని తెలిపారు.స్థానిక చరిత్ర, వారసత్వ సంపదతో పాటు మరుగునపడిన పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకురావడం, పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థుల విజయానికి దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా యువ టూరిజం క్లబ్‌ గైడ్‌ టీచర్లు, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ధూల్మిట్ట పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.