ధూల్మిట్ట పాఠశాలకు మరో ఘనత
జిల్లాస్థాయి యువ టూరిజం క్లబ్ పోటీల్లో మూడో స్థానం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ధూల్మిట్ట జెడ్పీహెచ్ఎస్ సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో ధూల్మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడో స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లాలోని 78 పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో ధూల్మిట్ట పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి అనుముల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ధూల్మిట్ట పాఠశాల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల్లో పర్యాటక ప్రాంతాలు, స్థానిక...