EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • షాట్‌పుట్‌లో ముస్త్యాల విద్యార్థి ప్రభంజనం

    Author P శివశంకర్ | 21 Sep 2026, 07:49 PM | TELANGANA
    షాట్‌పుట్‌లో ముస్త్యాల విద్యార్థి ప్రభంజనం

    జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం కైవసం!
    ​సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వెలుగల కరుణాకర్
    ​క్రీడల్లో రాణించి చేర్యాల ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చిన విద్యార్థి

    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    ​జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
    ​చేర్యాల మండల పరిధిలోని ముస్త్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థి జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. చేర్యాల పట్టణానికి చెందిన వెలుగల కరుణాకర్ ముస్త్యాల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్, యూత్, సీనియర్, జావెలిన్, క్రాస్ కంట్రీ మరియు ఎన్‌ఐడీ జామ్ (NID-JAM) ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో కరుణాకర్ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో షాట్‌పుట్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయిలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
    ​వెల్లువెత్తిన ప్రశంసలు – అభినందనలు
    ​జిల్లా స్థాయిలో ముస్త్యాల పాఠశాల పేరును, చేర్యాల పట్టణ ఖ్యాతిని చాటిన విద్యార్థి వెలుగల కరుణాకర్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చేర్యాల మండలానికి చెందిన మాజీ మంత్రి తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి ఉపేందర్ గుప్త, చేర్యాల మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ వెలుగల దుర్గయ్య విద్యార్థిని ఘనంగా అభినందించారు.
    ​గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థిగా ఉంటూ ఆటల్లో ఇంతటి ప్రతిభ చూపడం గర్వకారణమని, రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి చేర్యాల ప్రాంతానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ముస్త్యాల జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు, పీఈటీ, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు కరుణాకర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰